Saturday, November 23, 2024
HomeTrending Newsహైదరాబాద్ లో పోలీసు స్టేషన్ల ముట్టడికి బిజెపి పిలుపు

హైదరాబాద్ లో పోలీసు స్టేషన్ల ముట్టడికి బిజెపి పిలుపు

జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు…. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న దోషులను అరెస్ట్ చేయడపట్ల చూపితే న్యాయం జరిగేదన్నారు.

టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. ఈ తరహా అత్యాచార ఘటనలు రోజుకో కొత్త కేసు వెలుగు చూడడం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమన్నారు. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనమే అన్నారు. నేరాలను అరికట్టడంలో మేమే నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయింది. ఈ ఘటనలపై స్పందించరా అన్నారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు, దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

అయితే జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో జరుగుతోన్న అవకతవకలకు నిరసనగా బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. రేపు నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ముందు నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని బీజేపీ ఆరోపించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్