Tuesday, September 24, 2024
HomeTrending Newsబిజెపి నేతలపై తెరాస సోషల్ మీడియా ఫిర్యాదు

బిజెపి నేతలపై తెరాస సోషల్ మీడియా ఫిర్యాదు

తెలంగాణ తెచ్చిన నాయకుడు, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కించపర్చేలా స్కిట్ వేసిన బీజేపీ నాయకులపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీఆర్ఎస్ సోష‌ల్‌మీడియా క‌న్వీన‌ర్ వై. స‌తీశ్‌రెడ్డి పోలీసుల‌ను కోరారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణనిరాహార దీక్ష చేసి, కేంద్రం మెడ‌లువంచి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్‌పై అనుచిత‌, అస‌భ్య‌క‌ర‌, అభ్యంత‌క‌ర‌మైన స్కిట్స్ వేయ‌డాన్ని టీఆర్ఎస్ సోష‌ల్‌మీడియా త‌ర‌ఫున ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కించపర్చేలా స్కిట్ వేసిన, వారిని ఉసిగొల్పిన బీజేపీ నాయకులు బండి సంజయ్, ప్రేమేందర్‌రెడ్డి, జిట్టా బాలకిషన్‌రెడ్డి, రాణిరుద్రమపై హైదరాబాద్ వ‌న‌స్థ‌లిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డికి శుక్ర‌వారం ఆయ‌న‌ ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వై. సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదు..ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడ‌ని, అభ్యంతరకర స్కిట్స్‌తో ఆయన ప్రతిష్టను దిగజార్చార‌ని మండిప‌డ్డారు. ఈ స్కిట్ వేయించిన వాళ్లు కనీసం ఆయన కాలి గోటికి కూడా సరిపోరన్న విషయాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. బీజేపీ నాయ‌కుల్లాగే తామూ ప్ర‌ధానిపై విమ‌ర్శ‌లు చేయ‌గ‌ల‌మ‌ని, కానీ, ఆ స్థాయికి దిగ‌జార‌ద‌ల్చుకోలేద‌ని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయ‌కులు ఇలాగే చిల్ల‌ర‌గా వ్య‌వ‌హ‌రిస్తే తెలంగాణ ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోబోర‌ని హెచ్చ‌రించారు. బీజేపీ నాయ‌కులు వేయించిన స్కిట్‌లో తెలంగాణ ప‌థ‌కాల‌ను కూడా కించ‌ప‌ర్చార‌ని తెలిపారు. తెలంగాణ ప‌థ‌కాల‌ను ప్ర‌ధానితోస‌హా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు మెచ్చుకున్న విష‌యాన్ని కూడా మ‌రిచిపోయార‌న్నారు.

పింఛ‌న్ల కోసం మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల‌ను చంపుకుంటున్న‌ట్లు స్కిట్‌లో చూపించార‌ని, ఇదిచూసి బండి సంజ‌య్‌, ప్రేమేంద‌ర్‌రెడ్డి న‌వ్వుతున్నార‌ని స‌తీశ్‌రెడ్డి మండిపడ్డారు. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తుంటే చూసి ప‌ళ్లు ఇకిలించే మీరు ఎలా నాయ‌కుల‌య్యారంటూ దుయ్య‌బ‌ట్టారు. మరీ ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా ? అని ప్ర‌శ్నించారు. బీజేపీ నాయకులకు చివరిసారిగా హెచ్చరిస్తున్నామ‌ని, ఇకనుంచైనా ఇలాంటివి మానుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌న్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని కించపర్చేలా ఎవ‌రు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు

Also Read : నక్సలైట్ లకు భయపడలేదు.. నీకు భయపడతామ?

RELATED ARTICLES

Most Popular

న్యూస్