Wednesday, April 2, 2025
HomeTrending Newsపల్లెలపై మీ పెత్తనం ఏమిటి? కేంద్రంపై కేసిఆర్ ఫైర్

పల్లెలపై మీ పెత్తనం ఏమిటి? కేంద్రంపై కేసిఆర్ ఫైర్

What is this? కేంద్ర ప్రభుత్వం విధానాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. నేరుగా పల్లెలకు కేంద్రం నిధులు పంపడం చిల్లర వ్యవహారమని మండిపడ్డారు.  ఢిల్లీ నుంచి నేరుగా కేంద్రమే పథకాలు అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు.  స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని, రోజువారీ కూలీ డబ్బులు కూడా నేరుగా కేంద్రమే పంచాలనుకోవడం సరైనదేనా అని అయన ప్రశ్నించారు.  ప్రగతి భవన్ లో పల్లె-పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష చేపట్టిన కేసిఆర్ తన ప్రారంభోపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేస్తుకుంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నా.. ఇంకా  దేశంలో కరెంటు లేని గ్రామాలు ఉన్నాయని, సాగు-తాగు నీరు కోసం ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారని…  విద్య, వైద్య రంగాల్లో ఆశించిన ప్రగతి లేదని, కేంద్రం వీటిపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకుంటోందని విమర్శించారు.

సమైఖ్య పాలనపై మరోసారి కేసిఆర్ ధ్వజమెత్తారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో తెలంగాణా నాశనమైందని, ధ్వంసమైన తెలంగాణాను తిరిగి నిర్మిస్తున్నామని,  బాగు చేసుకోవడానికి చాలా కాలం పట్టిందని వ్యాఖ్యానించారు. అన్ని కష్టాలను అధిగమించి దేశం గర్వించే స్థాయిలో తెలంగాణాను పునర్ నిర్మిస్తున్నామన్నారు. తాము అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందన్నారు.  రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అటవీ శాఖ, అడవుల పరిరక్షణపై సమీక్షలు చేస్తే చాలా మందికి అది ఒక జోక్ లా నిపించిందని,  నేడు పర్యావరణం, పచ్చదనంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని గుర్తు చేశారు. గ్రామీణ మంచి నీటి వ్యవస్థను  దేశం గర్వించేలా తీర్చిదిద్దుకున్నామని, ఇంటింటికీ మంచినీరు అందిస్తోన్న ఏకైక రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు.

Also Read : అమిత్ షా పొలిటికల్ టూరిస్ట్..తెరాస విమర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్