Monday, May 20, 2024
HomeTrending Newsఅమిత్ షా పొలిటికల్ టూరిస్ట్..తెరాస విమర్శ

అమిత్ షా పొలిటికల్ టూరిస్ట్..తెరాస విమర్శ

Amit Shah Political : బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ అంతర్గత సంఘర్షణ యాత్రగా మారిందని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు. పాదయాత్రలో మా అభివృద్ధి పనులను అధ్యయనం చేసే అవకాశం బీజేపీ నేతలకు కలిగిందని, మిషన్ భగీరథ నీళ్లు తాగి ఉంటారు, పల్లె ప్రకృతి వనాల్లో సేద తీరి ఉంటారు. 24 గంటల కరెంటుతో మీ పాద యాత్ర ఇబ్బంది లేకుండా సాగిందన్నారు. హైదరాబాద్,  తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బిజెపి నేతల తీరును తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ధరలు పెరిగాయని ప్రజలు సంజయ్ ను నిలదీశారని, ఇప్పటికైనా సంజయ్ కు జ్ఞానోదయం అయ్యింది అనుకుంటున్నామన్నారు. సంజయ్ కి బీజేపీకి విధానాలు ముఖ్యం కాదని విద్వేషాలే ముఖ్యమని నెల రోజుల పాదయాత్రలో చేసిన ప్రసంగాలు చెబుతున్నాయని, రేపు రంగారెడ్డి జిల్లాకు వస్తున్న అమిత్ షా తెలంగాణకు ఏం ఇవ్వలేదు, ఏం ఇవ్వబోము అని చెప్పడానికి  వస్తున్నారా అని ప్రశ్నించారు.
కేవలం చుట్టపు చూపుగా, పొలిటికల్ టూరిస్ట్ గా అమిత్ షా వస్తానంటే కుదరదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇస్తారా ఇవ్వరా అమిత్ షా చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. విభజన చట్టం హామీలు అమలు చేసేది లేదని చెప్పడానికి అమిత్ షా వస్తున్నార అన్న మంత్రి గ్యాస్ సీలిండర్ పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామని రేపటి సభలో అమిత్ షా చెప్పగలరా అని సవాల్ విసిరారు. అమిత్ షా రేపు ఎం మాట్లాడుతారో మేము ఉహించగలమని, ఉరికే ఊక దంపుడు మాటలు మాట్లాడి వెళ్లిపోవడం కాదు.. తెలంగాణ కు ఏం చేస్తారో అమిత్ షా చెప్పాలన్నారు. విద్వేషాలు రెచ్చ గొట్టడానికి కాదు-విధానాలు చెప్పడానికి అమిత్ షా రావాలన్నారు. బీజేపీ సభ పెట్టే తుక్కుగూడా పరిసర ప్రాంతాలే చాలు.. టీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తెలుస్తుంది. తెలంగాణ కు బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చిందో సంజయ్ శ్వేత పత్రం విడుదల చేస్తే ,మహేశ్వరం అభివృద్ధికి మా ప్రభుత్వం ఎం చేసిందో మేము శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు లేవో అమిత్ షా చెప్పాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి డిమాండ్ చేశారు.

బీజేపీ జాతీయ నేతలు తెలంగాణ అభివృద్ధి పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, పొలిటికల్ టూరిస్టు ల్లా మారిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరాకు నీరు రాలేదు అని పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారని, రాష్ట్రం అప్పులు కోవిడ్ తర్వాత 28 శాతం పెరిగితే కేంద్రం అప్పులు 60 శాతం పెరిగాయన్నారు. బీజేపీ నేతలకు తిట్లు తప్ప ఏం రావని, అమిత్ షా ఏ మొహం పెట్టుకుని తెలంగాణ కు వస్తున్నారని రంజిత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతలతో ఊదు కాలదు పీరు లేవదని, ఎప్పట్నుంచో తెలంగాణలో అధికారం లోకి వస్తున్నామని బీజేపీ నేతలు చెబుతుంటారు.. అది జరిగే పని కాదని విమర్శించారు.

Also Read : మూడోసారికి మోడీ రెడీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్