Friday, March 29, 2024
Homeసినిమా'రామ్ అసుర్' యూనిట్ కు దాస్యం అభినందన

‘రామ్ అసుర్’ యూనిట్ కు దాస్యం అభినందన

Dasyam commended Ram Asur:
అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామ్ అసుర్’. చాందిని త‌మిళ్‌రాస‌న్‌,  శెర్రి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. కథ ఈ సినిమాకు హైలైట్ కాగా అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్, శానీ సల్మాన్ ల నటన అదనపు ఆకర్షణగా నిలిచింది.  హీరోయిన్స్ గ్లామర్ అదనపు ఆకర్షణ. వెంకటేష్ త్రిపర్ణ సరికొత్త కథ కథనాలతో ఆద్యంతం ఈ సినిమా ను ప్రేక్షకులు అలరించే విధంగా ముందుకు తీసుకెళ్లారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి.

ఈమధ్య కొన్ని నగరాల్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించిన చిత్ర బృందం తాజాగా వరంగల్ లో సందడి చేసింది. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి సినిమాను వీక్షించింది. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ “రామ్ అసుర్ సినిమా అద్భుతంగా ఉంది. హీరో అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ ల నటన చాలా బాగుంది. ప్రత్యేకమైన పాత్రలో శానీ సల్మాన్ మంచి నటన కనపరిచాడు. దర్శకుడు వెంకటేష్ ఈ సినిమా ను మంచి కథ తో తెరకెక్కించి విజయం సాధించారు. ఈ చిత్రాన్ని యూనిట్ తో కలిసి వీక్షించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్