Saturday, March 14, 2026
HomeTrending Newsమరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు

మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు

రాష్ట్రంలో మరో పది రోజులపాటు  లాక్ డౌన్ పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్ని మూడు గంటలు పెంచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ లాక్ డౌన్ కు సడలింపు ఇచ్చారు.  ప్రజలు ఇళ్ళకు చేరుకునేందుకు మరో గంటపాటు వెసులుబాటు కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకూ మాత్రం  కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తారు. కరోనా నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిరాడంబరంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయంతో  జూన్ 9 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది.

తెలంగాణాలో వ్యవసాయ పరిస్థితులు, లాక్ డౌన్ తదితర అంశాలపై చర్చిందేందుకు నేటి మధ్యాహ్నం 2  గంటలకు సిఎం కేసియార్  అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట క్యాబినెట్ సమావేశమైంది. ఖరీఫ్ సీజన్ కు విత్తనాల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, ధాన్యం సేకరణ అంశాలపై కూడా చర్చించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular