Saturday, July 27, 2024
Homeసినిమావెరైటీ టైటిల్ తో ‘అల్లు శిరీష్‌.’

వెరైటీ టైటిల్ తో ‘అల్లు శిరీష్‌.’

అల్లు శిరీష్ హీరోగా రాకేష్‌ శశి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అల్లు శిరీష్‌ సరసన కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. జీఏ2పిక్చ‌ర్స్ సంస్థ, మ‌రో నిర్మాణ సంస్థ శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో క‌లిసి ఈ సరికొత్త ప్రేమకథను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి నిర్మాత‌గా విజ‌య్.ఎమ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆదివారం ఫస్ట్ లుక్‌నీ, టైటిల్ నీ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట‌’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. వెరైటీగా.. ఇంట్రస్టింగ్ గా ఉన్న ఈ టైటిల్ కు మంచి స్పందన లభిస్తుంది.

విజేత అనే సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు రాకేశ్ శ‌శి, ఇప్పుడు ప్రేమ కాదంట అనే విభిన్న కథా చిత్రాన్ని అంద‌ర్ని ఆక‌ట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుందని నిర్మాత విజ‌య్. ఎమ్ తెలిపారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ధీర‌జ్ మోగిలినేని సహా నిర్మాత‌. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా ప్రకటించనున్నారు. మరి.. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ కి ప్రేమ కాదంట చిత్రం ఆశించిన విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్