Thursday, March 12, 2026
HomeTrending Newsయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల  నియామకం

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల  నియామకం

రాష్ట్రం లోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం  ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, రాష్ట్రం లోని యూనివర్సిటీ లకు వైస్ ఛాన్సలర్ ల నియామక ప్రక్రియను చేపట్టింది. కరోనా నేపథ్యం లో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్ధుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది. శనివారం నాడు రాష్ట్ర గవర్నర్  వీసీ ల నియామకానికి ఆమోదం  తెలిపారు.

 వీసిల నియామకం వివరాలు….

 ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరబాద్) వీసీ గా ప్రొ. డి. రవీందర్ యాదవ్ (బీసీ) .,

కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీ గా ప్రో. టి.రమేష్ (బీసీ)., తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీసీ గా ప్రో. డి. రవీందర్ (వైశ్య).,

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరబాద్) వీసీ గా ప్రొ. సీతారామారావు (ఓసి, బ్రాహ్మణ)., పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(హైదరబాద్) వీసీ గా ప్రొ. టి.కిషన్ రావు ( ఓసి వెలమ)., పాలమూరు యూనివర్సిటీ, (మహబూబ్ నగర్) వీసీ గా ప్రొ. లక్ష్మీకాంత్ రాథోడ్( ఎస్టీ)., మహాత్మాగాంధీ యూనివర్సిటీ, (నల్గొండ ) వీసీ గా ప్రో. సిహెచ్ గోపాల్ రెడ్డి,. 

జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరబాద్) వీసీ గా ప్రొ. కట్టా నర్సింహా రెడ్డి (ఓసి), శాతవాహన యూనివర్సిటీ, (కరీంనగర్)వీసీ గా ప్రో. మల్లేశం (ఎస్సీ మాల).,

జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీ గా , కవిత దర్యాని (ఓసి, సింధి) లను గవర్నర్ ఆమోదం మేరకు ప్రభుత్వం నియమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular