Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్జడేజా న్యూ లుక్

జడేజా న్యూ లుక్

భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త గెటప్ అందరినీ ఆకర్షిస్తోంది. ఎప్పుడూ తనదైన గడ్డంతో ఆకట్టుకునే ఈ ఆటగాడు గడ్డం తీసేసి ఉన్న తాజా ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. “నో బియర్డ్” అనే కాప్షన్ ఇస్తూ ఆశ్చర్యంతో  కూడిన ఈమోజీని జత చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండింగ్ అవుతోంది.

వయసు తగ్గిపోయింది, మీ సౌందర్య రహస్యం ఏమిటని కొందరు, ఈ ఫోటో మీదేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఇది జడేజా ఫోటో కాదు అతని తమ్ముడిది అంటూ జోకులేస్తున్నారు.

ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న జడేజా ఈ సీజన్ లో మంచి ఆటతీరు ప్రదర్శించాడు. అటు బౌలింగ్ లోను, ఇటు బ్యాటింగ్ లోను అద్భుతంగా రాణించి ఆకట్టుకున్నాడు. అయితే కోవిడ్ తో ఈ ఐపిఎల్ నిరవధికంగా వాయిదా పడడంతో  జడేజా  కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నాడు.

వచ్చేనెలలో న్యూజీలాండ్ తో జరిగే వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ కు రెడీ అవుతున్నాడు జడేజా. సౌతాంప్టన్ లో  జరిగే ఈ కీలక మ్యాచ్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్