రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 30 పొడిగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయం తీసుకున్న కెసిఆర్ లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారి చేయాలని సిఎస్ ను ఆదేశించారు. ఈ నెల 11న జరిగిన మంత్రివర్గం 10 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 20న మరోసారి కేబినేట్ సమావేశమై లాక్ డౌన్ పై సమీక్షించాలని భావించారు.
అయితే లాక్ డౌన్ విధించిన తరువాత రాష్ట్రంలో కోవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపించింది. లాక్ డౌన్ మరి కొన్నాళ్ళు పొడిగిస్తే ఈ మహమ్మారిని మరింతగా అరికట్ట వచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే మంత్రుల అభిప్రాయాలను తెలుసుకొని పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ నేపధ్యంలో ఈ నెల 20న జరగాల్సిన కేబినేట్ భేటి రద్దయ్యింది.