Saturday, January 18, 2025
Homeతెలంగాణప్రైవేట్ దోపిడిపై చర్యలు తీసుకోండి : హైకోర్టు

ప్రైవేట్ దోపిడిపై చర్యలు తీసుకోండి : హైకోర్టు

కోవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడిపై తెలంగాణా హైకోర్టు సీరియస్ అయ్యింది. కోవిడ్ మొదటి దశలోనే ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తున్న చార్జీలపై దాఖలైన పిర్యాదులను పరిశీలించేందుకు ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన టాస్క్ ఫోర్స్ వేశారని హైకోర్టు గుర్తు చేసింది. కాని రెండో దశలో పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. టాస్క్ ఫోర్స్ వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

చాలా ఆస్పత్రుల్లో కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోవా విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి వారు పని చేస్తుంటే వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ హైకోర్టు. అసహనం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం ఇస్తున్న మెడికల్ కిట్స్ లో స్టెరాయిడ్స్ ఉన్నాయా అని ప్రశ్నించగా లేవని అడ్వకేట్ జనరల్ బదులిచ్చారు. స్టెరాయిడ్స్ పై తమకు మెయిల్స్ వస్తున్నాయని కోర్టు వెల్లడించింది.

వాక్సినేషన్ లో తెలంగాణా 15వ స్థానంలో వుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు రాగా వాక్సిన్ కోసం స్పెషల్ డ్రైవ్ ఎందుకు చెప్పలేదని ప్రభుత్వాన్ని అడిగింది. వృద్ధులు, పేదలకు వాక్సిన్ ఇచ్చేందుకు ఎన్జీవోలతో కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచన చేసింది.

ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచెన్ లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వారికి భోజనం అందించాలని, దీనికోసం కార్పోరేషన్లు, ఎన్జీవో ఒప్పందం చేసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 1 కి వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్