Saturday, November 23, 2024
HomeTrending Newsకృష్ణా వివాదంపై విచారణ వాయిదా

కృష్ణా వివాదంపై విచారణ వాయిదా

కృష్ణానదీ జలాల వివాదంపై దాఖలైన పిటిషన్ పై విచారణను తెలంగాణా హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తెలంగాణా ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.నంబర్ 34ను సవాల్ చేస్తూ కృష్ణాజిల్లాకు చెందిన రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదంపై సుప్రీంకోర్టుకు గాని, హైకోర్టుకు గాని విచారించే అధికారం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి అధికారాలు ట్రిబ్యునల్ కు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. సెక్షన్ 11 ప్రకారం అంతర్రాష్ట్ర జలవివాదం ప్రకారం ఈ పిటిషన్ విచారణ అర్హతపై పిటిషనర్ లను ప్రశ్నించింది. 2008లో జలవివాదాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చదువుకుని రేపు రావాలని సూచించిన ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

హైకోర్టులో జస్టిస్ రామచందర్ రావు బెంచ్ ముందు వాదనలు ప్రారంభం కాగానే ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేయాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కోరారు. పిటిషన్ ను జస్టిస్ రామచందర్ రావు బెంచ్ విచారిస్తుందని హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. పిటిషన్ ను తిరస్కరించాలని జస్టిస్ ను కోరిన తెలంగాణా అడ్వకేట్ జనరల్ కోరగా, ఎందుకు విచారించవద్దో చెప్పాలని ఏజీని జస్టిస్ రామచందర్ రావు అడిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్