Monday, May 20, 2024
HomeTrending Newsకేఆర్ఎంబీ మీటింగ్ వాయిదా వేయండి

కేఆర్ఎంబీ మీటింగ్ వాయిదా వేయండి

జూలై 9న జరగాల్సిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాశారు. వానాకాలం సీజన్ పనులతో పాటు.. కొన్ని ప్రాజెక్టు పనులతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు బిజీగా ఉన్నదున సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు.

ఈ నెల 9న హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ ఆర్పీ సింగ్ అధ్వర్యంలో త్రీమెన్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది.  ఈ సమావేశాన్ని జూలై 20న ఏర్పాటు చేయాలని రజత్ కుమార్ కోరారు.

శనివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలోనే సమావేశం వాయిదా వేయాలని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

కృష్ణా జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఎన్ బ్లాక్ కేటాయింపులు చేసినా, వాటిని నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని, జులై 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలని నాటి సమావేశంలో కెసియార్ అభిప్రాయపడ్డారు. జులై 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నేడు లేఖ రాశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్