Sunday, May 19, 2024
Homeసినిమామంత్రి హరీష్ రావు చేతుల మీదుగా "Eట్లు" ఫస్ట్ లుక్ పోస్టర్

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా “Eట్లు” ఫస్ట్ లుక్ పోస్టర్

Minister released: శ్రీజ ఆర్ట్స్ & బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజా గౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్. బాచిన నాగేశ్వరరావుల నిర్మాణంలో వస్తున్న సినిమా ‘Eట్లు’. ఈ సినిమా ద్వారా పందిళ్లపల్లి రోషిరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మంత్రి హరీష్‌ రావు  చేతుల మీదుగా విడుదల చేశారు.

హరీష్ రావు మాట్లాడుతూ. “Eట్లు మూవీ టీమ్ చూస్తుంటే.. అందరూ కొత్తవాళ్ల‌ల్లా ఉన్నారు అయిన దైర్యం చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తున్న టీమ్ కి నా శుభాకాంక్షలు. దర్శకుడు రొషిరెడ్డి,  ప్రొడ్యూసర్స్ కి ఈ చిత్రం వియవంతమై మంచి పేరుతో పాటు, డబ్బులు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు రొషిరెడ్డి మాట్లాడుతూ “నా మొదటి సినిమా Eట్లు ని ఆశీర్వదించిన మా హరీష్ రావు గారికి పాదాభివందనాలు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విజన్ స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. రిలీజ్ ఎప్పుడు అనేది అతిత్వరలో తెలియజేస్తాం” అన్నారు.

Also Read : ‘సేవాదాస్’ సంచలనం సృష్టించాలి : సుమ‌న్, భానుచంద‌ర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్