Friday, March 29, 2024
HomeTrending Newsకేటీఆరే నిజ‌మైన హీరో.. సోనూసూద్ ట్వీట్

కేటీఆరే నిజ‌మైన హీరో.. సోనూసూద్ ట్వీట్

రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా న‌టుడు సోనూసూద్ ప్ర‌శంసించారు. కేటీఆరే నిజ‌మైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంద‌ని విశ్వాసం వ్యక్తం చేశారు.

మిమ్మల్ని సంప్ర‌దించిన 10 గంట‌ల‌లోపే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్స్ స‌మ‌కూర్చార‌ని, మేలు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేమంటూ నంద కిశోర్ అనే వ్యక్తి కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ట్వీట్ చేశాడు. ప్ర‌జ‌ల సమస్యల పట్ల ఈ విధంగా స్పందించడం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని, నిజ‌మైన సూప‌ర్ హీరో కేటీఆర్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన నాయ‌కుడిని, త‌న‌కు చేత‌నైనంత స‌హాయం చేస్తున్నానన్నారు. సూప‌ర్ హీరో తాను కాదని …మీరు సోనూసూద్‌ను అల పిలవొచ్చంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసిన సోనూసూద్ కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ఎంతో చేస్తున్న‌ మీరే నిజ‌మైన హీరో అని….మీ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అభినందించారు. తెలంగాణ‌ను నా రెండో ఇల్లుగా ప‌రిగ‌ణిస్తున్నానంటూ సోను వెల్లడించారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాల నుంచి తెలంగాణ ప్ర‌జ‌లు నాపై ప్రేమ‌, అభిమానం చూపిస్తున్నార‌ని సంతోషం వ్యక్తం చేశారు. సోనూసూద్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కేతియార్ ‘మీరు చేస్తున్న ప‌ని చాలా గొప్ప‌ది. మీరు కోట్లాది మందికి ఆదర్శం’ అని కేటీఆర్ కితాబిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్