Saturday, June 6, 2026
Homeసినిమాసరసాలు చాలు స్క్రిప్ట్ ఆవిష్కరణ

సరసాలు చాలు స్క్రిప్ట్ ఆవిష్కరణ

Sarasaalu Chaalu: సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి  నిర్మిస్తున్న చిత్రం  ‘సరసాలు చాలు’ చిత్రం స్క్రిప్ట్ ను  నేడు ఆవిష్కరించారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో సీనియర్ నటి దివ్యవాణితో  కలిసి ‘సరసాలు చాలు. ఈ సినిమా స్క్రిప్టును ఆవిష్కరించారు.]

ఈ సందర్భంగా శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ  ఈ సినిమా టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉందన్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాతో బాగా ఎంజాయ్ చేస్తారన్నారు.  సినిమా విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు.

దర్శకుడు సందీప్ చేగూరి మాట్లాడుతూ “సరసాలు చాలు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. కామెడీ, రొమాన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ అందరిని ఆలోచింపజేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి జంటకు కనెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్ తో ఈ చిత్రం ఉండబోతోంద’ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular