Wednesday, June 10, 2026
Homeసినిమా కార్మికులతో చర్చించండి : మంత్రి తలసాని సూచన

 కార్మికులతో చర్చించండి : మంత్రి తలసాని సూచన

Talks:  కరోనా కారణంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ లు కార్మికులను చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.

ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు.  రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని చెప్పారు. సినీ కార్మికులలో అత్యధికంగా నిరుపేదలే ఉన్నారని, కరోనా సమయంలో షూటింగ్ లు లేక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సినీ కార్మికుల రెమ్యునరేషన్ కు సంబంధించి మూడు సంవత్సరాలపాటు ఒప్పందం ఉంటుందని, కరోనా కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులలో ఉన్నందున రెమ్యునరేషన్ పెంచే విషయమై ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు గడువు కోరడం జరిగిందని పేర్కొన్నారు.

ఆ గడువు ముగిసినందున తమ రెమ్యునరేషన్ పెంచాలని, ఇతర డిమాండ్ ల పై సినీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయాన్ని మంత్రి వివరించారు. కార్మికులు చేపట్టిన ఆందోళన ఉదృతం కాకముందే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి 2,3 రోజులల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.

Also Read : సమ్మె బాటలో సినీ కార్మికులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular