Fencing Championship :
పంజాబ్ లోని అమృతసర్ లో డిసెంబర్ 25 నుండి జరగనున్న జాతీయ జూనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్స్ షిప్ పోటీలకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. తెలంగాణ నుంచి 21 మంది క్రీడాకారులు ఈ పోటీలకు ఎంపికయ్యారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “సిఎం కెసియార్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉద్యోగాలలో 2%, ఉన్నత విద్య అభ్యసించేందుకు 0.5% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడా పాఠశాల లో మౌలిక సదుపాయాల కల్పన కు పెద్ద పీట వేస్తున్నామన్నారు. క్రీడాభివృద్ధిలో భాగంగా క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. జాతీయస్థాయిలో జరుగుతున్న ఫెన్సింగ్ ఛాంపియన్స్ షిప్ లో తెలంగాణకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.
Also Read : జీవితానికి తొలిమెట్టు క్రీడలు