Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్క్రీడాకారులకు మంత్రి అభినందన

క్రీడాకారులకు మంత్రి అభినందన

TS Players for International event: జాతీయ కరాటే చంపియన్ షిప్  విజేతలను రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. మీరట్ లో డిసెంబర్ 25, 26 న జరిగిన 6వ ISKU జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ – 2021 లో తెలంగాణ కు చెందిన జైనా కలీల్, నాద, సాయి తేజ, శక్తి నిషా తో పాటు మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన గౌతమ్ లు బంగారు పతకాలు సాధించి, ఏప్రిల్ 20 – 26, 2022 లో కెనడా లోని ఒంటారియో లో జరిగే అంతర్జాతీయ ISKU కరాటే ఛాంపియన్స్ పోటీలకు ఎంపికయ్యారు.

క్రీడాకారులు నేడు హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలుసుకున్నారు. మంత్రి వారిని అభినందించి, అంజర్జాతీయ పోటీల్లో కూడా గెలిపొంది విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. వీరితో పాటు డిసెంబర్ 20 న ఢిల్లీలో జరిగిన రోలర్ స్కేటింగ్ లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ లో గోల్డ్ మెడల్స్ ను సాధించిన మద్ది విక్రమ్ గౌడ్, మద్ది జీవన్ గౌడ్ లను అభినందించారు.

ఈ కార్యక్రమంలో కోచ్ లు కన్నా గౌడ్, MD జుబేర్, MD ఫిరోజ్, తిరుపతి లతో పాటు క్రీడాకారులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Also Read : హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్యాపిటల్ : శ్రీనివాస గౌడ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్