Thursday, March 27, 2025
HomeTrending Newsసిఫార్సు లేఖలు వద్దు: వైవీ విజ్ఞప్తి

సిఫార్సు లేఖలు వద్దు: వైవీ విజ్ఞప్తి

Vaikuntha Darshan – No Letters: జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపిలు సిఫారసు లేఖలు పంపవద్దని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీ కి సహకరించాలని కోరారు.

పది రోజుల పాటు ఛైర్మన్ కార్యాలయం లో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందువల్ల  వైకుంఠ ఏకాదశి రోజున  ప్రజా ప్రతినిధులకు  తిరుమలలోని నందకం, వకుళ ఆథితి గృహాల్లోవసతి కల్పిస్తున్నామని,  ఒక వేళ తిరుమలలో వసతి సరిపోకపోతే  తిరుపతిలోనే బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు.

శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతి లోని మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్ లో వసతి పొందాలని  చైర్మన్ తెలిపారు.  పదిరోజుల వైకుంఠ ద్వారదర్శనం సందర్భంగా విఐపిల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తుల ఎక్కువ సమయం దర్శనం కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

తాళ్ళపాక అన్నమాచార్యులు నడచిన మార్గాన్ని వైవీ సుబ్బారెడ్డి నేడు పరిశీలించారు. శ్రీవారి భక్తులు అన్నమయ్య మార్గం ద్వారా సొంత వాహనాలలోను‌, నడక ద్వారా తిరుమలకు చేరుకునేలా అభివృద్ధి చేయడానికి డిపిఆర్ సిద్ధం చేయమని అధికారులను ఆయన ఆదేశించారు.

Also Read : జనవరిలో పదిరోజులపాటు వైకుంఠ దర్శనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్