Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్దర్శనాలు పెంచే ఆలోచన లేదు: టీటీడీ ఈవో

దర్శనాలు పెంచే ఆలోచన లేదు: టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి దర్శనాలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ మూడో దశ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొన్ని రోజులపాటు కొనసాగిస్తామని వెల్లడించారు.  తిరుమలలో మరిన్ని ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

శ్రీవారికీ వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పండించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, గో ఆధారిత నెయ్యిని సొంతంగా సమకూర్చుకునే ఆలోచనలో ఉన్నామని వివరించారు. ఆగష్టు 15నుంచి పుష్పాలతో అగరబత్తులను తయారు చేస్తామన్నారు. అగరబత్తుల ఆదాయాన్ని గోసంరక్షణ ట్రస్టుకు మళ్ళిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. అదనపు బూందీ పోటు భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. వంశపార్యంపర అర్చక బలోపేతానికి కమిటీ వేస్తామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్