Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్శ్రీవారి భక్తులకు ఊరట

శ్రీవారి భక్తులకు ఊరట

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు పొందిన భక్తులకు టిటిడి వెసులుబాటు కల్పించింది. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు రిజర్వ్ చేసుకుని కోవిడ్ వల్ల రాలేని వారు సంవత్సరంలోపు ఎప్పుడైనా దర్శించుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.

కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. రవాణా సదుపాయం లేక శ్రీవారి దర్శనానికి ఎక్కువమంది వెళ్ళలేకపోతున్నారు. 15 వేల టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నా 4 వేలలోపే భక్తులు దర్శనం పొందుతున్నారు. ఏప్రిల్ 12 నుంచి మే 31 వరకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ఏడాది లోపు దర్శనం పొందవచ్చు. అయితే ఒక్కసారి మాత్రమె తేది మార్పు చేసుకునేందుకు వీలుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్