Saturday, January 18, 2025
HomeTrending Newsరాములోరి పెళ్ళికి సిఎంకు ఆహ్వానం

రాములోరి పెళ్ళికి సిఎంకు ఆహ్వానం

Pelli Pilupu: కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది.  ఈ మేరకు క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఆహ్వన శుభపత్రికను టిటిడి అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌తో పాటు ఆలయ అర్చకులు కూడా పాల్గొన్నారు.

పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 15న  రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరననుంది.   ఈ నెల 9 నుంచి 19 వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్