Thursday, March 19, 2026
HomeTrending Newsడాలర్ శేషాద్రి కన్నుమూత

డాలర్ శేషాద్రి కన్నుమూత

Dollar Seshadri died:
తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ పి. శేషాద్రి (డాలర్ శేషాద్రి) గుండెపోటుతో మరణించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్ళిన శేషాద్రికి నేటి తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే చికిత్స కోసం ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించేలోగా మార్గమధ్యంలోనే మృతి చెందారు.

తుది శ్వాస వరకు భగవంతుడి సేవలోనే గడిపారు డాలర్ శేషాద్రి, నేడు ఆర్కేబీచ్ లో టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన శేషాద్రి  నిన్న సాయంత్రం సింహాచలం వరాహాలక్ష్మీ నృసింహ్మస్వామి వారిని దర్శించుకున్నారు.

1978 నుంచి అర్చకుడిగా శ్రీవారి సేవలో కొనసాగుతున్న శేషాద్రి 2007 లో రిటైర్ అయ్యారు. ప్రముఖులతో ఆయనకున్న సంబంధాల నేపథ్యంలో ఆయన్ను టిటిడి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా ప్రత్యేకంగా నియమించారు. శ్రీవారి బంగారు నాణేల కుంభకోణంలో అయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో కొన్నాళ్ళు ఆయన్ను పదవి నుంచి తప్పించారు. కానీ విచారణ తర్వాతా అయన పాత్ర లేదని తేలడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, వివిధ దేశాలనుంచి వచ్చే వివిఐపి లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు అయన వారి వెన్నంటి ఉండేవారు. పండుగల సందర్భంలో ముఖ్యమంత్రులకు శ్రీవారి తరఫున ఆశీర్వచనాలు అందించే సమయంలో కూడా అయన మిగతా అర్చకుల కంటే కీలకంగా వ్యవహరించేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular