Sunday, January 19, 2025
HomeTrending Newsటిటిడి విరాళాల స్వీక‌ర‌ణ ప్రారంభం

టిటిడి విరాళాల స్వీక‌ర‌ణ ప్రారంభం

TTD-Seva: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తోన్న చిన్న పిల్లల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి కోసం విరాళాలు సేకరణకు  నేటి నుంచి ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచింది.

నేడు, ఫిబ్రవ‌రి 16న బుధ‌వారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విరాళాల స్వీక‌ర‌ణ ప్రారంభమైంది.  https://tirupatibalaji.ap.gov.in  వెబ్‌సైట్ ద్వారా దాత‌లు విరాళాలు స‌మ‌ర్పించ‌వ‌చ్చు.  ప‌లు కార‌ణాల వ‌ల్ల ఇప్పటివ‌ర‌కు ఖాళీ అయిన 531 ఉద‌యాస్తమాన సేవా టికెట్లను దాత‌ల‌కు అందుబాటులో ఉంచారు, ఇందుకోసం వారంలో శుక్రవారం నాటికైతే రూ.1.50 కోట్లు, మిగిలిన రోజుల్లో అయితే ఒక కోటి రూపాయ‌లను దాత‌లు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ముందు వ‌చ్చిన వారికి ముందు అనే ప్రాతిప‌దిక‌న ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా పార‌ద‌ర్శకంగా ఈ సేవా టికెట్ల కేటాయింపు జ‌రుగుతుంది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అన్నిసేవల్లో పాల్గొనే అవకాశం ఉదయాస్తమాన సేవ ద్వారా టీటీడీ భక్తులకు అందిస్తోంది. భక్తులు ఎంచుకున్న తేదీలో  ఒక టిక్కెట్ పై ఆరుగురితో  సేవల్లో  పాల్గొనే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్