Kalyanamastu: తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టు 7న ఈ కార్యక్రమం చేపట్టనుంది. ఉదయం 8 నుంచి 8గంటల 17 నిమిషాల మధ్య ముహూర్తంలో రాష్ట్రంలోని 26జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆగస్ట్ 7న కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, జిల్లా కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’ అంటూ టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
ఆర్ధిక కారణాల వల్ల వివాహాలు చేసుకోవడానికి ఇబ్బంది పడే పేదలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. స్వర్గీయ వైఎస్ హయంలో మొదలైన ఈ కార్యక్రమాన్ని టిటిడి పెద్ద ఎత్తున జరిపిందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు ముందుకు వస్తే అక్కడ కూడా కళ్యాణమస్తు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.