Saturday, January 18, 2025
Homeజాతీయంఇండియాకు ట్విట్టర్ భారీ సాయం

ఇండియాకు ట్విట్టర్ భారీ సాయం

కోవిడ్ రెండో దశ తో అల్లాడుతున్న ఇండియాకు విదేశాల నుంచి నైతిక మద్దతుతో పాటు ఆర్ధిక సాయం కూడా అందుతోంది.  ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్  ఫాం ట్విట్టర్ భారత్ కు 110 కోట్ల రూపాయల (15 మిలియన్ డాలర్లు) భారీ విరాళాన్ని ప్రకటించింది.

ట్విట్టర్ సి ఈ ఓ జాక్ పాట్రిక్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సాయం మొత్తాన్ని మూడు స్వచ్చంద సంస్థలు  కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ ద్వారా అందిస్తామని చెప్పారు.

కేర్ సంస్థకు 10 మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ కు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున అందిస్తామని వివరించింది. సేవా ఇంటర్నేషనల్… ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా పనిచేసే సేవా సంస్థ.

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు ఇతర పరికరాల కొనుగోలుకు ఈ సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్