మణిపూర్‌లో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని నరైన్‌సెన్‌లో మంగళవారం రెండు మిలిటెంట్ వర్గాలు భారీ స్థాయిలో కాల్పులు జరుపుకున్నాయి. గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్న ఒకరు బాంబు పేలుడులో మరణించగా, మరో వ్యక్తి భుజంపై బుల్లెట్ గాయమైంది.
పోలీసులు మంగళవారం జరిపిన సోదాలలో వేర్వేరు గ్రూపులకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఆయధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్ లోయలోని ఐదు జిల్లాలలో భద్రతా బలగాల తనిఖీలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.
కుకి జో తెగల వారికి మయన్మార్ నుంచి అదునాతన ఆయుధాలు అందుతున్నాయి. దీంతో కుకి మిలిటెంట్ లు మైతాయ్ గ్రామాల వారిని తుపాకులతో బెదిరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.