Saturday, January 18, 2025
Homeసినిమాబాలయ్య బర్త్ డే కి రెండు సినిమాలు స్టార్ట్

బాలయ్య బర్త్ డే కి రెండు సినిమాలు స్టార్ట్

జూన్ 10న నందమూరి నటసింహం బాలకృష్ణ జన్మదినం. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాలో నటిస్తున్నారు. మే 28న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన న్యూలుక్ ని బాలయ్య పుట్టినరోజున రిలీజ్ చేయనున్నారని తెలిసింది.

ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ మూవీ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆతర్వాత త్రిష పేరు కూడా వినిపించింది. అయితే.. ఇంకా హీరోయిన్ ఎవరు అనేది కన్ ఫర్మ్ కాలేదు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా సినిమా చేయనున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి రామారావు గారు అనే టైటిల్ కన్ ఫర్మ్ చేసినట్టు సమాచారం. ఈ రెండు సినిమాలను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ప్రకటించనున్నారని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్