Sunday, January 19, 2025
Homeసినిమాభీమ్లా నాయ‌క్ కోసం రెండు రిలీజ్ డేట్స్?

భీమ్లా నాయ‌క్ కోసం రెండు రిలీజ్ డేట్స్?

two days blocking: ఆర్ఆర్ఆర్.. ఈ సంచ‌ల‌న చిత్రం ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కార‌ణంగా వాయిదా ప‌డింది. అంతా సెట్ అయ్యింది జ‌న‌వ‌రి 7న ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది అనుకంటే.. థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా మ‌రోసారి వాయిదా ప‌డ‌డం తెలిసిందే. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తార‌ని ఎదురు చూసిన సినీ జ‌నాల‌కు ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చార‌ని.. అలాగే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టార‌ని చెప్పవచ్చు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ బాట‌లోనే.. భీమ్లా నాయ‌క్ కోసం కూడా మేక‌ర్స్ రెండు రిలీజ్ డేట్స్ లాక్ చేశార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శకత్వం వ‌హించారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించ‌డం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే.. ఆర్ఆర్ఆర్ కోసం భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని వాయిదా వేశారు.

ఆత‌ర్వాత ఫిబ్రవ‌రి 25న రిలీజ్ చేయ‌నున్నట్టుగా ప్రక‌టించారు. అయితే… ఆర్ఆర్ఆర్ మూవీకి రెండు రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేసిన‌ట్టే.. భీమ్లా నాయ‌క్ కూడా రెండు రిలీజ్ డేట్స్ ను లాక్ చేసే ప‌నిలో ఉన్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. అందులో ఒక‌టి ఫిబ్రవ‌రి 25 భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌ అని ఆల్రెడీ అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. మ‌రి.. రెండో డేట్ ఏంటంటే… ఏప్రిల్ 1న టాక్ వినిపిస్తోంది. అయితే… ఏప్రిల్ 1న ఆచార్య విడుద‌ల అని ఆల్రెడీ ప్రక‌టించారు. భీమ్లా నాయ‌క్ ఫిబ్రవ‌రి 25న రిలీజ్ చేయ‌డం కుద‌ర‌క‌పోతే… ఏప్రిల్ 1న రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే… ఆచార్య ప‌రిస్థితి ఏంటి.?  మ‌ళ్లీ ఆచార్య‌ వాయిదా ప‌డ‌నుందా అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read : ఆర్ ఆర్ ఆర్ కోసం రెండు డేట్లు బ్లాక్ చేసిన రాజమౌళి

RELATED ARTICLES

Most Popular

న్యూస్