ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ రాయ్ విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. ఫిలిప్ఫీన్స్‌కు దక్షిణ, మధ ఉన్న ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో మూడున్నర లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లు, బీచ్ ఫ్రంట్ రిసార్ట్‌లను విడిచిపెట్టి వెళ్లిపోయారు.
పర్యాటక ద్వీపాలైన కరగ, విసయాస్, మిందనోల్లో టైఫూన్ తుపాను కారణంగా గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీచాయి. కుండ పోత వర్షం గ్రామాలను ముంచెత్తింది. అనేక ప్రాంతాలతో కమ్యూనికేషన్లు తెగిపోయాయి. బలంగా వీస్తున్న ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్థంభాలు పడిపోవడంతో విద్యుత్‌కి అంతరాయం ఏర్పడింది.
Also Read : పాకిస్తాన్‌లో ద్రవ్యోల్భణం