Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Rambo: మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఉడుంబు’ తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి ‘ర్యాంబో’ అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన రత్నాకరం అనిల్ రాజు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తమ తమశాఖల్లో నిష్ణాతులైన స్టార్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

హోలీ పండుగను పురస్కరించుకుని ర్యాంబో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మార్చి 28 నుంచి సెట్స్ కు వెళ్లనున్న ఈ క్రేజీ చిత్రానికి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.  యువ సంగీత సంచలనం సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి సాంగ్స్: రామజోగయ్య శాస్త్రి, డైలాగ్స్: రైటర్ మోహన్, డాన్స్: శేఖర్ మాస్టర్, ఫైట్స్: స్టంట్ జాషువా, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు, సమర్పణ: టి.సి.ఎస్.రెడ్డి, నిర్మాత: గంగపట్నం శ్రీధర్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రత్నాకరం అనిల్ రాజు.

Also Read : థమన్ చేతుల మీదుగా ‘ముఖచిత్రం’ లిరికల్ సాంగ్ రిలీజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com