Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయంబ్రిటన్ లో జాన్సన్ వ్యాక్సిన్

బ్రిటన్ లో జాన్సన్ వ్యాక్సిన్

జాన్సన్  అండ్ జాన్సన్ తయారు చేసిన సింగల్ డోస్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. బ్రిటన్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ అనుమతి లభించడంతో ఇకపై తమ పౌరులకు ఈ వ్యాక్సిన్ అందించనున్నారు బ్రిటన్ అధికారులు.

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని ఈ తాజా వ్యాక్సిన్ కు అనుమతి రావడంతో మరింత మందిని ఈ వైరస్ నుంచి కాపాడగాలుగుతామని బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మ్యాట్ హాన్కాక్ తెలియజేశారు.  జాన్సన్ సింగల్ డోస్ అందుబాటులోకి రావడంతో యువకులు సైతం వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. బ్రిటన్ 2 కోట్ల డోసులు కొనుగోలు చేస్తోంది.

బ్రిటన్ ప్రధాని బొరిక్ జాన్సన్ దీనిపై స్పందిస్తూ ఈ తాజా వ్యాక్సిన్ కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు మరింత తోడ్పడుతుందని ట్వీట్ చేశారు.

అమెరికాలో జరిపిన పరిశోధనల ప్రకారం జాన్సన్ వ్యాక్సిన్ కరోనా నుంచి, దాని సరికొత్త వేరియంట్ల నుంచి 72 శాతం వరకూ రక్షణ కల్పిస్తుందని వెల్లడైంది.

బ్రిటన్ లో ఇప్పటివరకూ ఆరు కోట్ల ఇరవై లక్షల మందికి వ్యాక్సిన్ పూర్తయ్యింది. ఫైజర్, ఆస్ట్రాజెనికా లు ఎక్కువమందికి ఇవ్వగా, మోడెర్నా టీకా కూడా కొందమందికి వినియోగించారు. ఇప్పుడు తాజాగా జాన్సన్ రావడంతో నాలుగు రకాల టీకాలు బ్రిటన్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్