Sunday, January 19, 2025
Homeజాతీయంఇక తెలుగులో బీటెక్‌

ఇక తెలుగులో బీటెక్‌

తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఈమేరకు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు ఏఐసీటీఈ ఆమోదించింది. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ నిబద్ధతతో ఉన్నారని మంత్రి ప్రధాన్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్