కరోన బాధితులకు అత్యవసరంగా ఇచ్చేందుకు సింగల్ డోసు టీకా అందుబాటులోకి వచ్చింది. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోసు టీకా జాన్సెన్ కు ఇండియాలో అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవియ ఈ రోజు ప్రకటించారు. అత్యవసర వినియోగానికి జాన్సెన్ ఉపయోగకరంగా ఉంటుందని, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అవకాశాల్ని పరిశీలిస్తోందని మంత్రి వివరించారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తరపున అత్యవసర వినియోగానికి ఇండియా లో అనుమతి ఇవ్వాలని ఇదివరకే దరఖాస్తు చేసుకోగా భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జాన్సెన్ సింగల్ డోసు వ్యాక్సిన్ తో భారత దేశ ప్రజలకు ప్రయోజనకారిగా ఉంటుందని జాన్సన్ అండ్ జాన్సన్ హర్షం వ్యక్తం చేసింది. కరోనపై ఈ టీకా 85 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, టీకా తీసుకున్న 28 రోజుల నుంచి ఫలితాలు ఇస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోని అన్ని రకాల వాతావరణాల్లో టీకా వినియోగించగా సత్ఫలితాలు ఇచ్చిందని కంపనీ వర్గాలు వివరించాయి. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ తో టీకా ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నారు.
దేశంలో ఇప్పటికే యాభై కోట్ల జనాభాకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగగా, జాన్సెన్ వ్యాక్సిన్ తో మరణాల రేటు తగ్గించవచ్చని భారత ప్రభుత్వం అంచనా. కొద్ది రోజులుగా రోజుకు సుమారు యాభై లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.