కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు. ఈనెల 17న రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోన్న తెలంగాణ బీజేపీ నేతలు.
నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వద్ద సభకు ఏర్పాట్లు చేస్తోన్న కమలం నేతలు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని మర్రి చెట్టు వద్ద ఊచకోత కోసిన రజాకార్లు. కాలక్రమంలో వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి. అమిత్ షా పర్యటన రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొననున్న బండి సంజయ్.