రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలుకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మనబడి- నాడు నేడు, ఫౌండషన్ స్కూళ్ళు, విద్యాకానుక పై అధికారులతో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

మొదటి విడతలో దాదాపు వెయ్యి స్కూళ్ళకు సి.బి.ఎస్.ఈ. అనుబంధం కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలియజేయగా, ఐసిఎస్ఈ అఫీలియేషన్ పై కూడా దృషిపెట్టాలని సిఎం కోరారు.

విద్యార్ధులు వచ్చే ఏడాది అందించేందుకు ఉద్దేశించిన యూనిఫాం, కిట్లను సిఎం పరిశీలించారు. స్వేఛ్చ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు అందించే శానిటరీ నాప్కిన్స్ పంపిణీపై కూడా సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ మధ్యలో ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.

సమీక్ష సందర్భంగా సిఎం చేసిన సూచనలు:

  • రెండో విడత నాడు-నేడు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలి
  • రెండో విడతలో 4,535.74 కోట్ల రుపాయలతో 12,663 స్కూళ్ళలో నాడు-నేడు
  • 7,821 కోట్ల రూపాయలతో 24,900 స్కూళ్ళలో మూడో విడత నాడు-నేడు
  • స్కూళ్ళ నిర్వహణ, టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి
  • వచ్చే ఏడాది పిల్లలు స్కూళ్ళకు వెళ్ళే నాటికే విద్యా కానుక అందించాలి
  • పాఠ్య పుస్తకాల ముద్రణ నాణ్యత పెంచాలి
  • విద్యా కానుక కింద ఇచ్చే వస్తువుల విషయంలో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
  • స్పోర్ట్స్ షూ, డ్రస్ కూడా నాణ్యమైనవి ఇవ్వాలి

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, తావేటి వనిత, అధికారులు, సలహాదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *