Friday, March 29, 2024
Homeసినిమాఅక్టోబర్ 8న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

అక్టోబర్ 8న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై నిర్మిస్తున్నారు. ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘గీత గోవిందం’, ‘ప్ర‌తిరోజు పండ‌గే’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల అయింది. అఖిల్ లోని 7 వర్షన్స్ చూపిస్తూ విడుదలైన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో 7 విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు అఖిల్. ఫార్మల్ లుక్ నుంచి.. మోడ్రన్ అవతారం వరకు అన్ని షేడ్స్ లో అలరించారు అఖిల్. తాజాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేశారు. ఈ సినిమా అఖిల్ కి విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు టీమ్ సభ్యులు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్