Friday, June 12, 2026
HomeTrending Newsశ్రీవారి సేవలో గజేంద్ర సింగ్ షెకావత్

శ్రీవారి సేవలో గజేంద్ర సింగ్ షెకావత్

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి  గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ నేడు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేంద్రమంత్రికి  టిటిడి అధికారులు సంప్రదాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో  అర్చక పండితులు వేదాశీర్వచ‌నం చేశారు. టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ సంద‌ర్భంగా  గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్‌కు  శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో గజేంద్ర సింగ్ వెంట రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు, ఎంపిలు మిథున్ రెడ్డి, శ్రీ రెడ్డెప్ప, టిటిడి మాజీ బోర్డు స‌భ్యుడు, బిజెపి నేత భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ అధికారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular