Saturday, November 23, 2024
HomeTrending Newsమోడీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: కిషన్ రెడ్డి

మోడీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: కిషన్ రెడ్డి

కరోనా లాంటి క్లిష్ట సమయంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు కాబట్టే జాతి  యావత్తు గుండెల మీద చేయి వేసుకొని నిద్ర పోగలుగుతున్నారని కేంద్ర పర్యాటక, సంస్కృతిక శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రధాని అయన ఈ ఏడేళ్ళలో ఎక్కడా ఉగ్రవాద కార్యకలాపాలు లేవని, బాంబు పేలుళ్లు లేవని గుర్తు చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తిరుపతిలో బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ ఏర్పాటు చేసిన సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సిఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. మోడి ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన కిషన్ రెడ్డికి తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.  ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రధానిగా ఉన్నారు కాబట్టే అన్ని మతాలవారూ ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారన్నారు.

కిషన్ రెడ్డి చేసిన ప్రసంగంలో ముఖ్యంశాలు:

  • తిరుపతి వెంకన్న ఆశీస్సులు కోసం వచ్చాను
  • సమర్థవంతంగా పాలన అందిస్తున్న నరేంద్ర మోడీకి కి ఆశీస్సులు అందించాలి
  • మనలాంటి దేశంలో  కరోనా అరికట్టేందుకు మాస్క్ లు ధరించాలి
  • కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్క్ లు మనకోసం ధరించాలి
  • దేశంలో 130 కోట్ల మంది కోవిడ్ వారియర్స్ గా మారాలి
  • పోలియో వచ్చిన తర్వాత20 సంవత్సరాల తర్వాత మనదేశానికి వ్యాక్సిన్ వచ్చింది
  • కరోనా విషయంలో ప్రపంచ దేశాల తో పోటీ పడి వ్యాక్సిన్ సొంతంగా అందించడంలో మోదీ కృషి మరువలేనిది, ప్రపంచ దేశాలే నివ్వరపోయాయి
  • నరేంద్ర మోదీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు
  • 80 కోట్ల మంది కి ఆహార భద్రత ఇస్తోంది
  • కరోనా సందర్భంగా ఒక్కొక్క రికీ 5కిలోల బియ్యం ఉచితం గా బియ్యం ఇస్తున్నాం
  • లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇళ్ళు మంజూరు చేశారు
  • నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక చట్టాలు చేయడం జరిగింది
  • జమ్మూకాశ్మీర్ లో 75సంవత్సరాల గా అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలేదు
  • ఆర్టికల్370 రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగం అమలకు వీలైంది నేను ఆశాఖలో ఉండడం అదృష్టం గా భావిస్తున్నాను
  • నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాజిక మార్పు తీసుకుని వస్తుంది
  • దేశంలో దళిత ఎంపీ లు , గిరిజన, బిసిలు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న పార్టీ బిజెపి
RELATED ARTICLES

Most Popular

న్యూస్