విజయవాడ నగరంలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు స్వాగతం పలికారు.


ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను పరిశీలించిన చౌహాన్. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు.