Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో తమిళ్ తలైవాస్ పై యూపీ యోధ; తెలుగు టైటాన్స్ పై గుజరాత్ జెయింట్స్ విజయం సాధించాయి.
యూపీ యోధ – తమిల్ తలైవాస్ మధ్య హోరాహోరీగా జరిగిన మొదటి మ్యాచ్ లో 41-39తో యూపీ విజయం సాధించింది. ప్రథమార్థంలో తలైవాస్ 22-20తో ముందంజలో నిలిచినప్పటికీ ద్వితీయార్థంలో ఆ జోరు కొనసాగించలేకపోయారు, 21-17తో యూపీ పైచేయి సాధించింది. మ్యాచ్ సమయం ముగిసే నాటికి రెండు యూపీ ఆటగాళ్ళు సురేందర్ గిల్-13; ప్రదీప్ నర్వాల్-10 పాయింట్లు సాధించి విజయంలో తమ వంతు పాత్ర పోషించగా తమిళ్ కెప్టెన్ మంజీత్ కూడా 12 పాయింట్లతో రాణించాడు.
గుజరాత్ జెయింట్స్ – తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 34-32తో గుజరాత్ విజయం సాధించింది. ఆట తొలి భాగంలో రెండు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు ఆడడంతో 14-14 తో స్కోరు సమం అయ్యింది. రెండో భాగంలోకూడా చివరివరకూ ఉత్కంతగా జరిగినా చివరకు 20-18తో గుజరాత్ స్వల్పంగా ముందంజ లో నిలిచి రెండు పాయింట్లతో విజయం దక్కించుకుంది. తెలుగు రైడర్ 10 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (65 పాయింట్లు); హర్యానా స్టీలర్స్(58); దబాంగ్ ఢిల్లీ (57); బెంగుళూరు బుల్స్ (55); యూపీ యోధ (52); జైపూర్ పింక్ పాంథర్స్ (51) టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: హర్యానా, పాట్నా విజయం