యూపీ వారియర్స్ విమెన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సంపాదించింది. నేడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆష్లీ గార్డ్ నర్-60; దయాలన్ హేమలత -57; సోఫీ డంక్లీ-23 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో పర్షవి చోప్రా, రాజేశ్వరి గాయక్వాడ్ చెరో 2; అంజలి శర్వాణి, ఎక్సెల్ స్టోన్ చెరో వికెట్ పడగొట్టారు.
యూపీ 39 పరుగులకే మూడు వికెట్లు (దేవికా వైద్య-7; ఎలిస్సా హేలీ-12; కిరణ్ నవ్ గిరే-4) కోల్పోయింది. తహిలా మెక్ గ్రాత్- గ్రేస్ హారిస్ లు నాలుగో వికెట్ కు 78 పరుగులు చేశారు. తహిలా 57 (38 బంతులు, 10 ఫోర్లు) రన్స్ చేయగా గ్రేస్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి 19వ ఓవర్లో ఔటయ్యింది. ఈ దశలో ఎక్సెల్ స్టోన్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులతో నాటౌట్ గా నిలిచి మరో బంతి మిగిలి ఉండగానే గెలిపించింది. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
గుజరాత్ బౌలర్లలో కిమ్ గ్రాత్ 2; మోనికా పటేల్, గార్డ్ నర్, తనుజా కన్వర్, స్నేహ్ రానా తలా ఒక వికెట్ పడగొట్టారు.
గ్రేస్ హారిస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.