Tuesday, June 16, 2026
HomeసినిమాUstaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రెడీ.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రెడీ.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా వస్తే.. చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికి సెట్ అయ్యింది. అదే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ముందుగా ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అనుకున్నప్పటికీ ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఉస్తాద్ భగత్ సింగ్ గా టైటిల్ మార్చారు. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ 15 నుంచి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇందులో పవన్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది.ఇప్పటికే రిలీజ్ అయిన పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని మే 11న విడుదల చేయన్నట్లు మేకర్స్ తెలిపారు. దేవిశ్రీప్రసాద్ ఒక వీడియో బైట్ ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.

మే 11 కి గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయి సరిగ్గా 11 ఏళ్ళు కావడంతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ని దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు దేవిశ్రీప్రసాద్. ఇక తమ అభిమాన పవర్ స్టార్ మూవీ నుండి గ్లింప్స్ రానుండడంతో ఆయన ఫ్యాన్స్ అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. కాగా ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. మరి.. గబ్బర్ సింగ్ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular