Friday, October 18, 2024
HomeTrending Newsఅందుబాటులోకి మ‌రో 6 అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ లు

అందుబాటులోకి మ‌రో 6 అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ లు

మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మ‌రో 6 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) ఓకేసారి ప్ర‌జ‌లకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఏర్పాటు చేసిన అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను రేపు (గురువారం) అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించ‌నున్నారు.

ఔటర్ రింగురోడ్డు, చుట్టుపక్కల సమీపంలో ఈ పార్కులు ఉన్నాయి. ఉద‌యం 9 గంట‌ల‌కు నాగారం, 10.35 గంట‌ల‌కు ప‌ల్లెగ‌డ్డ‌, 11 గంట‌ల‌కు సిరిగిరిపూర్, 11.30 గంట‌ల‌కు శ్రీ న‌గ‌ర్, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తుమ్మలూర్, 12.40 గంట‌ల‌కు మ‌న్యంకంచ‌ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల‌ను ప్రారంభిస్తారు.

అటవీ ప్రాంతానికి తక్కువ నష్టం జరిగే విధంగా అభివృద్ధి పనులు చేపడుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం అరణ్య భవన్ లో జరిగింది.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వైస్ చైర్మన్, స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ హోదాలో అధ్యక్షత వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలు చేపట్టిన 30 అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి అవసరమైన అటవీ అనుమతులపై ఐదో రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి సమావేశంలో చర్చ జరిగింది.

అదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో చేపట్టిన రోడ్ల విస్తరణ, విద్యుత్ ఆధునీకరణ,
టీ పైబర్ గ్రిడ్ పనుల అనుమతులపై చర్చించారు.

వైల్డ్ లైఫ్ బోర్డులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు, అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగే విధంగా ప్రతిపాదనలు రూపొందించామని అన్నారు.

రాష్ట్ర స్థాయి అనుమతుల తర్వాత కేంద్ర అనుమతులు అవసరం అయితే, ఆ ప్రతిపాదనలు కేంద్ర వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపుతామని పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రితో పాటు, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్‌లు స్వర్గం శ్రీనివాస్, ఎం.సీ పర్గెయిన్, డీసీఎఫ్ శ్రీనివాసరావు, స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణకు మణిహారం- అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్