Monday, February 24, 2025
Homeసినిమా'ఊర్వశి' వృద్ధి చెందాలి : కృష్ణ

‘ఊర్వశి’ వృద్ధి చెందాలి : కృష్ణ

తన పుట్టినరోజును పురస్కరించుకుని… ప్రత్యేక పాటను విడుదల చేసిన ‘ఊర్వశి ఓటిటి’ మరింతగా వృద్ధి చెందాలని సూపర్ స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. “తెలుగు వీర లేవరా… దీక్షబూని సాగరా” అనే పంక్తులతో మొదలయ్యే ఓ ఉత్తేజభరిత గీతాన్ని.. ప్రముఖ దర్శకులు వీరు.కె స్వర సారధ్యం మరియు రచనలో.. ప్రముఖ సంగీత దర్శకులు-నటులు-దర్శకులు- గాయకులు ఆర్.పి.పట్నాయక్ ఆలపించారు. యువ గాయని మౌనిక గొంతు కలిపారు. ప్రముఖ ఓటిటి సంస్థ ఊర్వశి సౌజన్యంతో ఈ ప్రత్యేక గీతం రూపుదిద్దుకుంది.

సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని… ఆయన్ని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఊర్వశి సిఇఓ తుమ్మలపల్లి రామసత్యనారాయణ… తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణగారికి.. పుట్టినరోజు కానుకగా.. ఆయనపై ఓ ప్రత్యేక పాటను రూపొందించే అవకాశం ఇచ్చిన ప్రముఖ నటులు-‘మా’ అధ్యక్షులు వి.కె.నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్