Thursday, September 19, 2024
HomeTrending NewsUSA: అమెరికా విద్యార్థి వీసా స్లాట్లు విడుదల

USA: అమెరికా విద్యార్థి వీసా స్లాట్లు విడుదల

అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు సిద్ధమవుతున్న వారికి తీపి కబురు వచ్చింది. విద్యార్థి వీసా(F1) ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్ స్లాట్లు విడుదలయ్యాయి. జూలై నుంచి ఆగస్టు వరకు ఈ స్లాట్లు అందుబాటులో ఉండగా.. ustravelsdocs.com వెబ్‌సైటులో బుక్ చేసుకోవచ్చు. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్ళే వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. గత ఏడాది 1.25 లక్షల మంది భారత విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ అయ్యాయి.

గతేడాది 1.25 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు ఇవ్వగా, ఈ సారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అమెరికాకు వచ్చే ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయ విద్యార్థి ఉన్నారు. అమెరికాలోని విద్యా సంతలో ఏడాదిలో రెండు సార్లు ప్రవేశాలు నిర్వహిస్తాయి. ఆగస్ట్, డిసెంబర్ ప్రవేశాల కోసం భారత విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.ఇప్పటికే అనేకమంది విద్యార్థులు వివిధ విశ్వ విద్యాలయాల నుంచి ఐ-20 ధ్రువ పత్రాలను పొందారు. వీరికి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ముంబై, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ అమెరికన్ కాన్సులట్ లలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్