గర్భనిరోధక మాత్రలపై అమెరికాలో చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్ళు అమెరికాలోని ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరుగా స్పందించింది. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో అబార్షన్ డ్రగ్ మిఫిప్రిస్టోన్ అందరికీ అందుబాటులో ఉండేలా ఇవాళ అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మరోవైపు ఆ డ్రగ్ బ్యాన్ గురించి లీగల్ కేసు కొనసాగనున్నది. మిఫిప్రిస్టోన్ గర్భనిరోధక మాత్రలపై ఇటీవల టెక్సాస్ కోర్టు విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ ఆర్డర్‌పై స్టే విధించింది. మిఫిప్రిస్టోన్ ఔషధాన్ని బ్యాన్ చేయాలని టెక్సాస్ కోర్టు ఇటీవల ఓ సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
అమెరికాలో 2020లో సుమారు 10 లక్షల మంది మహిళల వరకు అబార్షన్ చేయించుకున్నారు. గట్‌మాచర్ ఇన్స్‌టిట్యూట్ ప్రకారం దాంట్లో 53 శాతం మంది మిఫిప్రిస్టాన్ పిల్స్‌తోనే గర్భాన్ని తొలిగించుకున్నారు. ఈ మాత్రల వినియోగం 2008లో 17 శాతం ఉండేది. 2017 నాటికి ఆ మాత్రల వాడకం 39 శాతానికి పెరిగింది.