Thursday, September 19, 2024
HomeTrending Newsఇండిపెండెంట్ గా ఉత్పల్ పర్రికర్

ఇండిపెండెంట్ గా ఉత్పల్ పర్రికర్

Utpan in Fray: గోవా మాజీ ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మహోహర్ పర్రికర్ కుమారుడు ఉత్పల్ పర్రికర్ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అయన స్వయంగా వెల్లడిస్తూ పనాజీ నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఉత్పల్ గోవా ఎన్నికలల్లో పనాజీ నుంచి పోటీ చేయాలని ఉత్పల్ నిర్ణయించారు, కానీ బిజెపి అధిష్టానం టికెట్ కేటాయించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియోకే కేటాయించింది.

మనోహర్ పర్రికర్ రెండు దశాబ్దాలుగా పనాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, ఇక్కడి ప్రజలతో ఆయనకు విశేషమైన అనుబంధం ఉందని, ఆ బంధాన్ని కొనసాగించేందుకే తాను ఇక్కడినుంచి పోటీ చేయాలని భావించానని ఉత్పల్ వివరించారు. ఇదే విషయాన్ని బిజెపి అధిష్టానానికి చెప్పానని అయితే వారు టికెట్ నిరాకరించారని చెప్పారు.

ఉత్పల్ తమ పార్టీలో చేరితో తాము పనాజీ టికెట్ కేటాయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ చేసిన ప్రతిపాదనపై ప్రశ్నించగా… తన ముందు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని ఒకటి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయడం లేదా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడమని స్పష్టం చేశారు.

గత ఉప ఎన్నికల్లో కూడా పోటీచేసేందుకు ఆసక్తి చూపానని, తుది జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో టికెట్ నిరాకరించారని ఉత్పల్ గుర్తు చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధిపై తాను విజయం సాధిస్తానని ఉత్పల్ ధీమా వ్యక్తం చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్