Wednesday, March 26, 2025
HomeTrending Newsఉత్తరాఖండ్ లో లోయలో పడ్డ పెళ్లి వాహనం

ఉత్తరాఖండ్ లో లోయలో పడ్డ పెళ్లి వాహనం

ఉత్తరాఖండ్ రాష్టంలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చంపావత్ జిల్లాలోని బుడం గ్రామం దగ్గరికి రాగానే పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిందని కుమావున్ పోలీసులు వెల్లడించారు. పంచముఖి ధర్మశాల సమీపంలోని తనక్పూర్ లో పెళ్ళికి హాజరై వస్తుండగా సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ దుర్ఘటన జరిగిందన్నారు. సుఖిదంగ్ రీత సాహిబ్ రోడ్డులోని లోతైన లోయలో వాహనం పడిపోవటంతో మృతుల సంఖ్య పెరిగిందని, మిగతా వారి కోసం లోయలో గాలింపు కొనసాగుతోందన్నారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ తో పాటు మరికొందరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులంతా కాకనై ప్రాంతంలోని దండ, కతోటి గ్రామాలకు చెందినవారని కుమావున్ డి.ఐ.జి నీలేష్ ఆనంద్ భరనే తెలిపారు. ఉత్తరాఖండ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున గాయపడ్డ వారికి 50 వేల చొప్పున ప్రధానమంత్రి కేంద్రం తరపున సాయం ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్